Share News

సంక్షేమ పథకాల సర్వే సక్రమంగా పూర్తిచేయాలి

ABN , Publish Date - May 03 , 2025 | 11:50 PM

సం క్షేమ పథకాల సర్వే సక్రమంగా పూర్తి చేయా లని, మున్సిపల్‌ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల ఆఫీసర్లతో వార్డుల స్థితిగతులను తెలుసుకున్నారు.

సంక్షేమ పథకాల సర్వే సక్రమంగా పూర్తిచేయాలి

పెద్దపల్లి టౌన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): సం క్షేమ పథకాల సర్వే సక్రమంగా పూర్తి చేయా లని, మున్సిపల్‌ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల ఆఫీసర్లతో వార్డుల స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో మంచినీటి సమస్య, శానిటేషన్‌, అభివృద్ధి పనులను ప్రగ తిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులు అనేక సంక్షేమ పథకాల సర్వే సక్రమంగా పూర్తి చేసి ప్రతీ నిరుపేద లబ్ధిదా రుడికి అందే విధంగా చూడాలన్నారు. అలాగే వేసవికాలం దృష్ట్యా ప్రతీ ఇంటికి తాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు

పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి టీఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా 30 కోట్ల రూపాయలు తీసుకువచ్చామన్నారు. ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, అమృత్‌ పథకంలో రూ.25 కోట్లతో మూడు ట్యాంకులు, పైపులైన్‌ నిర్మాణం, డీఎం ఎఫ్‌టీ నిధులు రూ.3 కోట్లతో చందపల్లి, రాం పల్లి వద్ద డబుల్‌ బెడ్‌ రూంల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, వ్యవ సాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, ఏఈ సతీష్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వార్డు ఆఫీసర్లు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:50 PM