Share News

బుధవారంపేట్‌ గ్రామస్తుల ధర్నా

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:11 AM

వ్యవసాయ భూములు మాత్రమే స్వాధీనం చేసుకుంటామంటే ఊరుకోనేది లేదని పూర్తి గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బుధవారంపేట్‌ గ్రామస్థులు అధికారులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. సింగరేణి ఓసీపీ-2 విస్తరణ పనుల కోసం సింగరేణి యాజమాన్యం కేవలం భూములనే స్వాధీనం చేసుకుంటే తాము సహించేది లేదని ధర్నా చేపట్టారు.

బుధవారంపేట్‌ గ్రామస్తుల ధర్నా

రామగిరి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూములు మాత్రమే స్వాధీనం చేసుకుంటామంటే ఊరుకోనేది లేదని పూర్తి గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బుధవారంపేట్‌ గ్రామస్థులు అధికారులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. సింగరేణి ఓసీపీ-2 విస్తరణ పనుల కోసం సింగరేణి యాజమాన్యం కేవలం భూములనే స్వాధీనం చేసుకుంటే తాము సహించేది లేదని ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్కకొం రయ్య మాట్లాడారు. గతంలో మండలంలోని బుధవారంపేట్‌, రాజాపూర్‌ గ్రా మాల పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమిని సింగరేణి స్వాధీనం చేసు కొని తిరిగి గ్రామస్థులకు ఇస్తారన్నారు. అనంతరం 88 ఎకరాలను మాత్రమే స్వాధీనం చేసుకొని సింగరేణి కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపిం చారు. మరో మారు రాజాపూర్‌ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు బుధవారంపేట్‌ భూములను మాత్రమే స్వాధీనం చేసుకుంటా మంటూ మోసం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేవలం భూములను స్వాధీనం చేసుకోవడంతో గ్రామస్థులకు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దంపేట్‌, మంగళపల్లి, వకీల్‌పల్లే గ్రామాల పరిస్థితి తమకు ఏర్పడుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో గ్రామాన్ని వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Updated Date - Dec 19 , 2025 | 12:11 AM