వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:40 AM
ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే భారీ వరదలు, వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దిద్దుళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా రావుల చెరువుకట్టలోని హనుమాన్ ఆలయ ఆవరణలో వినాయక మండపంలో గణపతి హోమంలో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పాల్గొన్నారు.
మంథని, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే భారీ వరదలు, వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దిద్దుళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా రావుల చెరువుకట్టలోని హనుమాన్ ఆలయ ఆవరణలో వినాయక మండపంలో గణపతి హోమంలో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పాల్గొన్నారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లోకి నీరు చేరి నష్ట పోయారన్నారు. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజా అభివృద్ధి, సంక్షేమానికి ఆటంకాలు కలగవద్దని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గాంధీచౌక్‌లో రూ.48 లక్షలతో వైకుంఠరథం, ఫీజర్ బాక్స్‌లను ప్రారంభించారు. రూ.1.28 లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.