Share News

ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:55 PM

సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వైద్య విద్య సం చాలకులు(అకాడమిక్‌) శివరాంప్రసాద్‌ అన్నారు. మౌలిక వసతులు, కావాల్సిన ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ను పరిశీలించడానికి సోమవారం వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌ తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వైద్య విద్య సం చాలకులు(అకాడమిక్‌) శివరాంప్రసాద్‌ అన్నారు. మౌలిక వసతులు, కావాల్సిన ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ను పరిశీలించడానికి సోమవారం వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌ తనిఖీలు నిర్వహించారు. మెడికల్‌ కళాశాలకు కావాల్సిన వసతులపై ప్రిన్సిపాల్‌ హిమబిందును, విద్యార్థులను తెలుసుకున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రాన్ని, జనరల్‌ వార్డులను పరిశీలించారు. రోగులు ఎదు ర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కావాల్సిన సౌక ర్యాలు, వసతులను వివరించారు. ఇక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నివేదిక సమర్పించనున్నట్టు డీఎంఈ తెలిపారు. కాగా మంగళవారం డాక్టర్స్‌ డే సందర్భంగా ఆసుపత్రి వైద్యులకు డీఎంఈ, కలెక్టర్‌ వైద్యుల సమ క్షంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌, ఆర్‌ఎంఓ రాజు, ప్రొఫెసర్లు అనూష, శ్రీనివాస్‌, అశోక్‌, హర్షిణి, ఓబులేష్‌, రవి వర్మ, అమల ఉన్నారు.

ఆడిటోరియం, ఎగ్జామ్‌ హాల్స్‌ను ఏర్పాటు చేయండి

సిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో విద్యార్థులకు ఎగ్జామ్‌ హాల్‌, ఆడిటోరియం ఏర్పాటు చేయాలని డీఎంవో శివరాంప్రసాద్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు కోరారు. ఫర్నీచర్‌, డైనింగ్‌ హాల్‌, మైక్రోస్కోప్‌లు, పుస్తకాలు, వీడియో కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మార్చురీ, కిచెన్‌, సీఎస్‌బీ, ఫార్మాసిస్టు భవనంతోపాటు బెడ్ల సంఖ్యను పెంచాలన్నారు.

వైద్య కళాశాలలో మౌలిక వసతులపై నివేదిక

సింగరేణి వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై వైద్య సంచాలకులు శివరాం ప్రసాద్‌కు నివేదిక సమర్పించినట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చెప్పారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య కళా శాల, టీచింగ్‌ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వ్యవహారాలపై ప్రత్యేక కమిటీ రూపొందించిందని, జాతీయ వైద్య విద్య కౌన్సిల్‌ నియమించిన రాష్ట్ర వైద్య బృందానికి నివేదికను అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వ కళాశాలతోపాటు జిరాక్స్‌ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కోరినట్టు తెలిపారు. టీఎస్‌ఎంఐడీసీ ఈఈ విశ్వ ప్రసాద్‌, కమిటీ సభ్యులు హిమబిందు, ఆర్‌ఎంఓ రాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:55 PM