ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:12 PM
ప్రజాభిప్రా య సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్క రిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పర్యా వరణ ప్రజాభి ప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు.
రామగిరి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజాభిప్రా య సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్క రిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పర్యా వరణ ప్రజాభి ప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మండలాల్లోని పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్ రత్నాపూర్, బుఽధవారంపేట్, జూలపల్లి, ముల్కలపల్లి, వకీల్‌పల్లి గ్రామాల సమీపంలో 4326 హెక్టార్ల విస్తీర్ణంలో 21 మిలియన్ టన్నుల ఓపెన్ కాస్టు బొగ్గు మైనింగ్‌కు రూపొందించిన డీపీఆర్‌పై ప్రజాభి ప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే 40 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా రామగుండంలో ఏర్పాటయ్యే తెలంగాణ సూపర్ ఽథర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గు సరఫరా చేసేం దుకు ఉపయోగపడేలా రామగుండం కోల్‌మైన్స్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు విస్తర ణకు ప్రభావిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయ కులు అందించిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలు నమోదు చేసి పర్యావరణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి నివేదిక అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు, ఆర్డీవో సురేష్, పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలపై గళం విప్పిన ప్రజలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వ ర్యంలో జేఎన్‌టీయు కళాశాలలో నిర్వహించిన పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణలో సమస్యలు వెల్లువె త్తాయి. ప్రభావిత గ్రామాలైన పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట్, జూలపల్లి, ముల్కలపల్లి, వకీల్‌పల్లి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతిని ధులు గ్రామాల్లో సింగరేణి కల్పించాల్సిన మౌలిక వస తులపై ఏకరువు పెట్టారు. సింగరేణి యాజమాన్యం కనీస వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. భూములు మావే అయినప్పటికి ఒక ట్రాక్టర్ మట్టి తీసుకెళ్ళే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను వీడి వెళ్ళే తమకు సింగరేణి అండగా ఉం డడం లేదన్నారు. తమకు ఉపాధి కల్పించే దిశగా సింగ రేణి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభావిత గ్రామాలకు ప్రత్యేకంగా 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదించారు. సింగరేణి లాభాలను ఇతర జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను సింగరేణి స్వాధీనం చేసుకొని తమకు అన్యాయం చేసిం దన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ ఫలాలకు దూరమయ్యామని పేర్కొన్నారు. నేటికి తాగునీరు, డ్రైనేజీలు, ఆర్‌అండ్‌ఆర్ కింద కేటా యించిన ప్లాట్స్‌లలో మౌలిక వసతులను కల్పించడంలో సింగరేణి విఫల మైందన్నారు. ప్రభావిత గ్రామాల యువతకు సింగ రేణిలో ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టు విస్తరణకు అడ్డుకాదని, గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.