నిష్పక్షపాతంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేస్తాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:53 PM
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకాన్ని నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ స్పష్టం చేశారు. శివకిరణ్ గార్డెన్స్‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికలో భాగంగా నిర్వహించిన సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మంథని, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరితో సమాలోచనలు చేసిన అనంతరం సమర్థవంతమైన నాయకుడిని అందరి ఆమోదం మేరకు ఎంపిక చేస్తామని వెల్లడించారు.
మంథని, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకాన్ని నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ స్పష్టం చేశారు. శివకిరణ్ గార్డెన్స్‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికలో భాగంగా నిర్వహించిన సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మంథని, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరితో సమాలోచనలు చేసిన అనంతరం సమర్థవంతమైన నాయకుడిని అందరి ఆమోదం మేరకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడి నియామకంలో ఎలాంటి పక్షపాతం లేకుండా నియమిస్తామన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, విజయరమణారావు లాంటి బలమైన నాయకత్వం ఉండడం శుభపరిణామమన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సంస్థాగత కమిటీ నియామకం కీలకంగా మారుతుందన్నారు. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీసీసీ అధ్యక్షుడి నియామకంపై స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పరిశీలకుడి దృష్టికి తీసుకువెళ్లచ్చన్నారు. పార్టీ కమిటీలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూనే మరో వైపు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కార వేణుగోపాల్‌రావు, పరిశీలకులు కేతురి వెంకటేష్, ఖాజా ఫక్రోద్దీన్, రాజేష్‌కాశీపాక, శశిభూషన్‌కాచే, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.