Share News

ప్రతీ రైతుకు భూ భద్రత కల్పిస్తాం

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:47 AM

భూమి ఉన్న ప్రతీ రైతుకు భూ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టర్‌ డి.వేణులతో కలిసి పాల్గొన్నారు.

ప్రతీ రైతుకు భూ భద్రత కల్పిస్తాం

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంరఽధజ్యోతి): భూమి ఉన్న ప్రతీ రైతుకు భూ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టర్‌ డి.వేణులతో కలిసి పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్‌ రైతులకు, ప్రజ లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరి పించి మ్యాప్‌ తయారు చేయాలన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. సాదాబైనామా పరిష్కారానికి భూ భారతి చట్టం సెక్షన్‌ 6 కింద ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగిం చిందని, 2014కు ముందు కొనుగోలు చేసిన వ్యవ సాయ భూములకు మాత్రమే సాదాబైనామా పట్టా లభిస్తుందన్నారు. 12 ఏళ్ళలో భూముల అనుభవంలో ఉన్న వారి దరఖాస్తులు పరిష్కారమవుతాయన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే అప్పిల్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. యాసంగి సీజన్‌లో కూడా ప్రభుత్వం క్వింటాల్‌ వడ్లకు 5 వందల రూపాయల బోనస్‌ అందిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొం టూ ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీ అమలు చేస్తు న్నామని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ కింద ఏకకాలంలో 20 వేల కోట్ల పైగా నిధులను విడుదల చేసినట్లు వివరించారు. రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇం డ్లు, సన్న బియ్యం పంపిణీ, గురుకుల పాఠశాలల్లో డైట్‌ చార్జీలు కాస్మోటిక్‌ చార్జీల పెంపు, 200 యూని ట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా, 5 వందల రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా మహిళలకు బస్సుల్లో ఉచి త ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను తీసు కువచ్చినట్లు వివరించారు. దశలవారీగా అర్హులం దరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు కార్పొరేట్‌ ఆసుపత్రులలో 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, అర్హత గల వారందరికీ రాజకీయాలకు అతీతంగా సీఎం రిలీఫ్‌ఫండ్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. అనం తరం ఇందిరమ్మ ఇళ్లు బేసిమెంట్‌ పూర్తి చేసుకున్న నిమ్మనపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు తూముల శ్రీనివాస్‌కు ప్రభుత్వం విడుదల చేసిన లక్ష రూపాయల చెక్కును అందజేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈర్ల స్వరూప, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హౌసింగ్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రాజయ్య, రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:47 AM