అర్హులైన వారికి పరిహారం అందిస్తాం
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:27 AM
సింగరేణి మైనింగ్‌లో భాగంగా భూములు కోల్పోయిన అర్హులైన వారికి పరిహారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో సింగరేణి మైనింగ్ లీజు, భూముల పరిహారంపై నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సింగరేణి మైనింగ్‌లో భాగంగా భూములు కోల్పోయిన అర్హులైన వారికి పరిహారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో సింగరేణి మైనింగ్ లీజు, భూముల పరిహారంపై నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సుందిల్ల గ్రామం లో ఆర్జీ-1 మైనింగ్ లీజు కింద 269 ఎకరాలలో సర్వే చేశామని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూములు సింగరేణి లీజు భూములుగా ఉన్నాయని తెలిపారు. ఒక్కో సర్వే నంబర్‌లో ఉన్న భూమిపై నలుగురు ఐదుగురు రైతులు యాజమాన్య హక్కులకు క్లైయిమ్ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అధికారికంగా ఎటువంటి పట్టాలు లేనపట్టికి కబ్జాలో ఉన్న వారు నష్టపోకుండా ఉండాలనే ఎకరానికి రూ.6.50 లక్షల పరిహారం ఇచ్చేలా సింగరేణి సంస్థను ఒప్పించామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే పరిహారం అందేలా గ్రామ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్హులైన వారికి పరిహారం చెల్లిస్తామని, జాబితాలో అనర్హులు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. భూవివాదాలు, సమస్యలు ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎవరి కబ్జాలో భూమి ఉన్నదో పరిశీలించి పరిహా రం చెల్లిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ, సింగరేణి అధికారులు నిర్వహించిన సర్వేలో వచ్చిన సమాచారం ప్రకారం భూ హక్కులను గ్రామ సభలో చదివి వినిపించామని, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సర్వే నంబర్ పరిధిలో ఎంత భూమి ఉన్నది, ఎవరి ఆధీనంలో ఉన్నదో పరిశీలించి పరిహారం అందిస్తామన్నారు. వివాద రహిత భూములకు వారంలో పరిహారం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ సురేష్, ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్, తహసీల్దార్ సుమన్‌తో పాటు రెవెన్యూ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా అన్ని వర్గాల ప్రజలకు అందించాలి
పెద్దపల్లిటౌన్, (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శనివారం కలెక్టరేట్ లో విద్యుత్ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం లో విద్యుత్ సరఫరా అంతరాయం కల్గకుండా అవసరమైన చర్యలు తీసుకో వాలని, జిల్లాలో 7 సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన మేర విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలన్నారు. లైన్‌మేన్ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్దరిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా లూజ్ వైర్లను టైట్ చేయాలని, జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసు కొని, అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇండ్ల పై నుంచి వెళ్ళే హై టెన్షన్ వైర్ల తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎస్‌ఈ మాధవ రావు, డీఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.