ధాన్యం బోనస్ డబ్బులు చెల్లిస్తాం
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:50 PM
త్వరలోనే యాసంగి,వానకాలం సన్న రకాలకు బోనస్ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం కొలనూర్, గోపరపల్లిలో వ్యవసాయ సహకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఓదెల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : త్వరలోనే యాసంగి,వానకాలం సన్న రకాలకు బోనస్ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం కొలనూర్, గోపరపల్లిలో వ్యవసాయ సహకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధాన్యాన్ని శుద్ధిచేసి, తేమశాతం తగ్గిన తరువాత కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించవద్దని తెలిపారు. కేంద్రంలో నిర్వాహకులు తప్పిదాలకు పాల్పడితే చర్యలు ఉంటాయన్నారు. రైతులు నిర్వాహకులకు సహకరించాలన్నారు. అనంతరం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిసేటి రాహుల్, ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణరెడ్డి, సీఈవో గోలి అంజిరెడ్డి, మాజీ సర్పంచులు బొంగోని రాజయ్య, సామ శంకర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి రవీందర్ గౌడ్, గుండేటి మధు యాదవ్, ఆకుల మహేందర్, చొప్పరి రాజయ్య, కుంచం మల్లయ్య పాల్గొన్నారు