ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:53 AM
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, దొంగతుర్తి, పైడిచింతలపల్లి, ఖానంపల్లి గ్రామాలలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ధర్మారం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, దొంగతుర్తి, పైడిచింతలపల్లి, ఖానంపల్లి గ్రామాలలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామాలను అభివృద్ది బాటలో నడిపిస్తున్నామని తెలపారు. 200 యునిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 5 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ధర్మారం మండలాన్ని అభివృద్ది బాటలో నడిపించడానికి సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ బలరపచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.