హామీలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:38 PM
తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మధ్యాహ్న భోజన నిర్వాహ కులు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మధ్యాహ్న భోజన నిర్వాహ కులు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారి నా మధ్యాహ్న భోజన కార్మికుల తలరాత మారడం లేదన్నారు.
గత ప్రభు త్వ హయాంలో మధ్యాహ్న భోజన వర్కర్లకు సరైన న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశ పడినా నెరవేరడం లేదన్నారు. నిత్యావసర సరుకులు ఇవ్వాలని, వర్కర్లను కార్మికు లుగా గుర్తించి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొన సాగిస్తామని తెలిపారు. మేకల యశోద, రాధమ్మ, లావణ్య, కళావతి, జుబేదా, వర్కర్లు పాల్గొన్నారు.