స్థానిక ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:26 AM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కాజిపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీ పరి శీలకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు.
జ్యోతినగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కాజిపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీ పరి శీలకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలను చేస్తున్నామన్నారు.
రైతు భరోసా కింద రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. కటింగ్ లేకుండా తడిసిన, రంగు మారిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డారని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే నాయకుల విజయానికి తాను కష్ట పడుతానని మక్కాన్‌సింగ్ స్పష్టం చేశారు. నియోజకవర్గం పరిశీలకులు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. సవవేశంలో నాయకులు బొంత రాజేశ్, కాల్వ లింగస్వామి, రవికువూర్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, తేజశ్విని, కొలని కవితారెడ్డి, తానిపర్తి గోపాల్‌రావు, ఎండీ.ఆసీఫ్, ఎం.డి.రహీం, పెండ్యాల మహేశ్, గట్ట రమేష్, ముస్తఫా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.