Share News

టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:59 PM

టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో కలెక్టరేట్‌లో సమావే శం నిర్వహించారు. తాగు నీటి సరఫరా, సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహణ, ఉపాధిహామీ పనులు, పారి శుధ్యం, టీబీ నివారణ, రేషన్‌ కార్డుల జారీ, ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం అంశాలపై అధికారు లతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో టీబీ నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో కలెక్టరేట్‌లో సమావే శం నిర్వహించారు. తాగు నీటి సరఫరా, సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహణ, ఉపాధిహామీ పనులు, పారి శుధ్యం, టీబీ నివారణ, రేషన్‌ కార్డుల జారీ, ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం అంశాలపై అధికారు లతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో టీబీ నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ నిక్షయ యాత్ర ద్వారా లక్షణాలు గల వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ పరీ క్షలు నిర్వహించాలని, మన గ్రామాలను టీబీ రహిత గ్రామాలుగా తయారు చేయాలన్నారు. ఈనెల 11న జిల్లాలో 0-6 మధ్య వయస్సు గల పిల్లల ఎదుగుదల మానిటరింగ్‌ చేయాలని, ప్రతీ శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. పిల్లల ఎదుగుదల వివరాలను పక్కగా నమోదు చేయాలన్నారు. ఎత్తు, బరువు తక్కువ ఉన్న పిల్లలకు బాలామృ తం ప్లస్‌, పోషకాహారం ఆందించాలని తెలి పారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఈనెల 14 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పిం చాలని కలెక్టర్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను కూడా ఫిజికల్‌ దరఖా స్తులు సమర్పించాలని, దీనిపై గ్రామాలలో ప్రచారం చేయాలన్నారు. ఈనెల 30లోపు రాజీ వ్‌ యువ వికాసం దరఖాస్తుల స్కూట్రిని పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. యువత ఏర్పాటు చేసే వ్యాపార యూనిట్ల ఆమోదయోగ్యంగా ఉండాలని, అందరూ ఒకే రకమైన యూనిట్లు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సమ్మర్‌ క్యాంప్‌ ఏర్పాటు ప్రణాళిక చేయాలన్నారు. డిగ్రీ విద్యార్థులు వలం టీర్లుగా పని చేసేందుకు ఆసక్తిగా ఉంటే సద రు వివరాలు ఈనెల 20 వరకు అందించాల న్నారు. పైలెట్‌ గ్రామాలలో మంజూరు చేసిన 1,920 ఇందిరమ్మ ఇండ్ల త్వరగా గ్రౌండ్‌ అయ్యే లా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెరిగేలా కార్యదర్శులు చూడాల న్నారు. 32 వేల నూతన రేషన్‌ దరఖాస్తుల స్కూట్రినీ కోసం 340 పైగా లాగిన్‌ ఇచ్చామని, ఈనెల 20లోపు పూర్తి చేయాలన్నారు. వేసవి లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు జరగ కుండా చూడాలన్నారు. అనాథ పిల్లల వివరా లను మే 10వ తేదీలోపు అందిస్తే గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. జడ్పీ సీఈవో నరేందర్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అన్న ప్రసన్నకుమారి పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:59 PM