Share News

డ్రగ్స్‌రహిత సమాజం కోసం పోరాడాలి

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:46 PM

మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు సంఘటితంగా పోరాటం చేయాలని, భవి ష్యత్‌ తరాలకు డ్రగ్స్‌ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి (డీఎల్‌ఎస్‌ఏ) స్వప్నారాణి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా నశాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కమ్యూనిటీ ఎడ్యుకేటర్‌ శ్యామల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేలా ముగ్గుల పోటీలు నిర్వహించారు.

డ్రగ్స్‌రహిత సమాజం కోసం పోరాడాలి

పెద్దపల్లి టౌన్‌, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు సంఘటితంగా పోరాటం చేయాలని, భవి ష్యత్‌ తరాలకు డ్రగ్స్‌ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి (డీఎల్‌ఎస్‌ఏ) స్వప్నారాణి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా నశాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కమ్యూనిటీ ఎడ్యుకేటర్‌ శ్యామల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేలా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు డ్రగ్స్‌ మూలంగా సమాజంలో కోల్పోతున్న జీవితాలకు అద్దం పట్టేవిధంగా వేసిన రంగవల్లులు అలరించాయి.

సీనియర్‌ సివిల్‌ జడ్జి (డీఎల్‌ఎస్‌ఏ) స్వప్నారాణి మాట్లాడుతూ చట్టాలపై అవగాహన చేసుకోవా లని సూచించారు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై సూచించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ఇప్పుడు సెల్‌ యుగం నడుస్తుందని ఇంటర్నెట్‌తో లాభ నష్టాలను వివరించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు ఆక ర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, భావితరాలకు మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ముగ్గు లను పరిశీలించి బహుమతులు ప్రదానం చేశారు. జనరల్‌ స్పెషలిస్టు సుచరిత మెప్మా ఇన్‌చార్జీ టీఎంసీ స్వప్న పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 11:46 PM