స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:52 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సత్తా చాటాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌రావు మాట్లా డుతూ గావ్ ఛలో, బస్తీ ఛలో కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించేందుకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని, అలాగే పలు విషయాలపై చర్చించారు.

ఓదెల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సత్తా చాటాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌రావు మాట్లా డుతూ గావ్ ఛలో, బస్తీ ఛలో కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించేందుకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని, అలాగే పలు విషయాలపై చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే నని, ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్య కర్తలు కృషిచేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించారని తెలి పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, రైతు భరోసా డబ్బులు రాలేదని తెలిపారు. పార్టీ మండల ఇంచార్జి దాత రాకేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్, నాయ కులు ఎర్రవెల్లి అనిల్ రావు, రామినేని రాజేంద్రప్రసాద్, పుల్ల సదయ్య, రాచర్ల అశోక్, అగ్గి శ్రీనివాస్, తూడి రాజేందర్, శ్రీకాంత్, రామచంద్రం పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌదరి మహేందర్‌యాదవ్ పిలుపునిచ్చారు. సుల్తానా బాద్ పట్టణంలో పార్టీ ముఖ్యకార్తల సమావేశాన్ని నిర్వ హించారు. మహేందర్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గామ్ ఛలో.. బస్తీ ఛలో కార్యక్రమంపై కార్యకర్తలకు వివరిస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో క్రియాశీల కార్యకర్తలు గ్రామంలో సంస్థాగత ఎన్నికల గురించి చర్చించాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకో వాలన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి కార్యక్ర మాన్ని నిర్వహించాలని, ప్రతీ కార్యకర్త ఇంటి పై పార్టీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. వార్డు మెం బర్ మొదలుకొని, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ వరకు అన్ని పదవులు కైవసం చేసుకోవాలన్నారు. ఓబీసీ విభా గం జిల్లా అధ్యక్షుడు చాతరాజు రమేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు వేగోళం శ్రీనివాస్ గౌడ్, పెరుక రమేష్, దళిత మోర్చా జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు లంక శంకర్, ఎల్లంకి రాజు, నాగన్న, సంతోష్, మల్క భాగ్యలక్ష్మి, మాటూరి లత, భూసారపు సంపత్, రామస్వామి, ఎనగందుల సతీష్, తిరుపతియాదవ్,శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయి నుంచి బీజేపీ పటిష్టానికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలని ఆవిర్భావ దినో త్సవ కమిటీ కన్వీనర్ గాదె రంజిత్‌రెడ్డి, సీనియర్ నాయ కులు కంకణాల జ్యోతిబసులు అన్నారు. ఎలిగేడులో మండలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ గ్రామ, బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాల న్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు దక్కించుకునేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు సాగా లని సూచించారు. గుజ్జుల మల్లారెడ్డి, అమరగండ గంగ య్య, కొత్తిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రాజు, శివపల్లి సత్యం, గోపు సురేందర్‌రెడ్డి, సత్తిరెడ్డి, మల్లేశం, తిరుపతి, పరశురాములుగౌడ్, పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని పాండవులగుట్టపై బీజేపీ ముఖ్య కార్యకర్తల సమా వేశం జరిగింది. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల ఇన్‌చార్జి ఊషణ అన్వేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్ని కలో బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి గెలిపిం చున్నారన్నారు. 10, 11, 12తేదీలలో గ్రామాలలో జరిగే గావ్‌ఛలో, బస్తీ ఛలో కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పా ల్గొని విజయవంతం చేయాలన్నారు. గూడెపు జనార్దన్ రెడ్డి, ములుకోజు వెంకన్న, చల్ల చంద్రమౌళి, శంకరా చారి, సల్పాల బాలు, కొమ్ము లక్ష్మణ్, ఎండి.రఫీ, రాగుల రాజ్‌కుమార్, నరేష్, కూస రాజు, శివ, పాల్గొన్నారు.