Share News

అధికారుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:35 PM

అధికారుల సంఘం హెచ్‌ఎంఎస్‌పై చేసిన ఆరోపణ లను ఖండిస్తున్నామని ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం తిలక్‌నగర్‌లోని హెచ్‌ఎంఎస్‌ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో అండర్‌ గ్రౌండ్‌లో పని చేస్తున్న యువ కార్మికులకు ప్రమాదాలకు గురవుతున్నారని, దీనికి అధికారుల సంఘం సమాధానం చెప్పాల న్నారు.

అధికారుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాం

గోదావరిఖని, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అధికారుల సంఘం హెచ్‌ఎంఎస్‌పై చేసిన ఆరోపణ లను ఖండిస్తున్నామని ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం తిలక్‌నగర్‌లోని హెచ్‌ఎంఎస్‌ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో అండర్‌ గ్రౌండ్‌లో పని చేస్తున్న యువ కార్మికులకు ప్రమాదాలకు గురవుతున్నారని, దీనికి అధికారుల సంఘం సమాధానం చెప్పాల న్నారు. 2024 జూలై 27న జీడీకే 2ఇంక్లైన్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయాలపాల య్యారని, అందులో ఇద్దరు కార్మికులు తుడి సంపత్‌, నోయల్‌ రాజ్‌ పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది, అయినా వారిని అండర్‌ గ్రౌండ్‌ ఫిట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కార్మికుల రక్షణ గురించి మాట్లాడిన వారికి సస్పెన్షన్లు, చార్జిషీట్లు ఇస్తున్నారని, ఇదెక్కడి న్యాయమన్నారు. ఆర్‌జీ-1లో అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ప్రమా దాలు చాలా ఉన్నాయని, వాటి మీద ఇప్పటి ఏ చర్యలు తీసుకోలేదన్నారు. డిప్యూటి జనరల్‌ సెక్రటరీ వెంకట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ గాలి కిరణ్‌ కుమార్‌, నాయకులు పల్లె క్రాంతి కుమార్‌, దబ్బెట సతీష్‌, రాజేష్‌, రామచందర్‌, చందర్‌ రావు, సంపత్‌, కుమార స్వామి, మల్లేశ్‌, నజీర్‌, రఫీ, శ్రీకాంత్‌, గోపాల్‌, రామస్వామి, రాయనర్సు, సంతోష్‌, స్వామి, శ్రీనివాస్‌, బక్కయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:35 PM