కలెక్టర్‌పై ఆరోపణలను ఖండిస్తున్నాం
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:28 PM
కలెక్టర్ కోయ శ్రీహర్షపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీ-జాక్ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. టి జాక్ చైర్మన్ మాట్లాడుతూ రామగుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడం సరైంది కాదన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కోయ శ్రీహర్షపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీ-జాక్ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. టి జాక్ చైర్మన్ మాట్లాడుతూ రామగుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడం సరైంది కాదన్నారు.
కలెక్టర్‌పై అసత్య ప్రచారం చేయడం వల్ల ఉద్యోగుల మనో ధైర్యం దెబ్బ తీయడమేనని అన్నారు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలలో విద్యార్థులకు తగిన వసతుల కల్పించేందుకు కావాల్సిన నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన విద్యను అందించేలా చేస్తున్నారని అన్నారు. జిల్లా అధికారులు వీర బుచ్చయ్య, మాధవి, రవీందర్, ప్రభాకర్, డాక్టర్ వాణిశ్రీ, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు