ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాం
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:24 AM
జిల్లాలో నిర్వహించిన మూడో విడత ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించా మని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఋధవారం కలెక్టర్ ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్‌ఎస్, పెద్దపల్లి మండ లం పెద్దకల్వల మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
పెద్దపల్లి రూరల్ / ఓదెల, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించిన మూడో విడత ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించా మని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఋధవారం కలెక్టర్ ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్‌ఎస్, పెద్దపల్లి మండ లం పెద్దకల్వల మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మూడో విడత 85 గ్రామ పంచాయతీలకు, 636 వార్డులకు నిర్వహిం చిన పోలింగ్ లో 85.66 శాతం మంది తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం, 11 గంటలకు 57.21 శాతం, 1 గంట వరకు 82.34 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరు కున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. కలెక్టర్ వెంట ఏసీపీ గజ్జి కృష్ణ, ఆర్వో లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.