చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేశాం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:15 AM
రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షంతో తడిసి, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షంతో తడిసి, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 329 కొనుగోలు కేంద్రాలలో ప్రారంభించగా ఇప్పటి వరకు 328 కేంద్రాల్లో పూర్తి చేశామని వివరించారు. మొత్తం 3లక్షల 96 వేల 805 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో దొడ్డురకం 3 లక్షల 97 వేల 17 మెట్రిక్ టన్నులు, సన్నరకం వడ్లు 77 లక్షల 88 .మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 58వేల 603 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 93 శాతం చెల్లింపులు జరిగాయని, జిల్లా వ్యాప్తంగా సన్న రకం వడ్లకు బోనస్ 38 కోట్ల 54 లక్షల రూపాయలు త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 2కోట్ల 16వేల 912 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా దొడ్డురకం కోటి 54 లక్షల 654 మెట్రిక్ టన్నులు, సన్నరకం 62 వేల 323 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 31 వేల 619 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. నియోజకవర్గంలో సన్న రకం వడ్లకు బోనస్ 31 కోట్ల రూపాయలు త్వరలో జమ చేస్తామని, తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కటింగ్ పేరుతో నట్టేట ముంచారన్నారు. ధాన్యం కొనుగోళ్ళపై బీఆర్‌ఎస్, బీజేపీలు అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని, ఢిల్లీలో రైతులు హక్కుల కోసం పోరాడుతుంటే కాల్పులు జరిపించారని, బీఆర్‌ఎస్ హయాంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపారన్నారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోళ్ళలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు ఆళ్ల సుమన్ రెడ్డి, చింతపండు సంపత్, రాంచంద్రరెడ్డి, కుర్రమల్ల రెడ్డి, నూగిల్లా మల్లన్న, భూత గడ్డ సంపత్, సయ్యద్ మస్రుత్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ధనాయక్ దామోదర్ రావు, అరె సంతోష్, సమా రాజేశ్వర్ రెడ్డి చిలుక సతీష్, బొజ్జ శ్రీనివాస్, బొంకురి అవినాష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, జడల సురేందర్, జగదీష్, అస్లాం, తూముల సుభాష్, తిరుపతి రావు, నాంసాని శ్రీనివాస్, వెంకటేష్, మహేష్, రెడ్డి రజినీకాంత్, కర్ణాకర్, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.