Share News

రామగుండం నవ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్నాం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:53 AM

రామగుండం నవ నిర్మాణమే ధ్యేయంగా తాము పని చేస్తునామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ స్టాంప్‌ డ్యూటీ, ఇతర నిధులతో సుమారు రూ.5కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

రామగుండం నవ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్నాం

కోల్‌సిటీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రామగుండం నవ నిర్మాణమే ధ్యేయంగా తాము పని చేస్తునామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ స్టాంప్‌ డ్యూటీ, ఇతర నిధులతో సుమారు రూ.5కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చంద్రబాబుకాలనీ, ఎన్‌టీపీసీ, గోదావరిఖని అశోక్‌నగర్‌లోని గర్ల్స్‌ హై స్కూల్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొరు. 186.5లక్షల నిధులతో ఆర్‌టీసీ, కేసీఆర్‌ కాలనీ, పద్మావతికాలనీ, ఆర్‌కే గార్డెన్స్‌ ఏరియా, మార్కండేయకాలనీ, దుర్గానగర్‌, భవానీనగర్‌ ప్రాంతాలు, రూ.1.97 కోట్లతో యైుటింక్లయిన్‌కాలనీ, రూ.కోటి నిధులతో అశోక్‌నగర్‌ బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ రామగుండంలోని వివిధ ప్రాంతాలు దశాబ్దాలుగా సౌకర్యాలులేక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించామన్నారు.

రామగుండాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకే రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. పనులన్నీ తుది దశకు చేరుకుంటున్నాయన్నారు. దీన్ని ఓర్చుకోలేని కొందరు పూటకో పార్టీ మార్చే నాయకులు, ప్రజల్లో లీడర్‌గా గుర్తింపు ఉండాలనుకునే వారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన బంద్‌ పిలుపునకు గోదావరిఖని ప్రజలు వినూత్న రీతిలో జవాబు ఇచ్చారని, ఉదయం 11గంటలకు తెరవాల్సిన షాపులను 9గంటలకే తెరిచి సమాధానం చెప్పారన్నారు. కొత్తగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంతో ఉపాధి పెరుగుతుందన్నారు. అలాగే రెండు ఆసుపత్రి బ్లాక్‌, ఒక క్యాత్‌ల్యాబ్‌ నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. పీజీ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నర్సింగ్‌ కళాశాలను అభివృద్ధి చేయడంతోపాటు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు కానున్నదన్నారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఎస్‌ఈ శివానందం, డీఈలు షాబాద్‌, శాంతి స్వరూప, జమీల్‌, ఏఈ మీర్‌, ఎంఈఓ మల్లేషం, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, సాగంటి శంకర్‌, శంకర్‌ నాయక్‌, కొలిపాక సుజాత, నాయకులు సాంబమూర్తి, శ్రీనివాస్‌, రాజిరెడ్డి, గుంపుల ఓదెలు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:53 AM