Share News

ఓట్ల దొంగలు గద్దె దిగాలి...

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:47 PM

ప్రజలు స్వచ్ఛమైన, న్యాయ సమ్మతమైన ఎన్నికల కోసం ఏకతాటిపైకి రావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్‌ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మెయిన్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించారు.

ఓట్ల దొంగలు గద్దె దిగాలి...

గోదావరిఖని, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజలు స్వచ్ఛమైన, న్యాయ సమ్మతమైన ఎన్నికల కోసం ఏకతాటిపైకి రావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్‌ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మెయిన్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో ములాఖత్‌ అయి ఓట్ల చోరీకి పాల్పడుతుందన్నారు.

ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లను చోరీ చేస్తున్నారన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా దొంగదారిలో బీజేపీ, దాని మిత్రపక్షాలు గద్దెనెక్కుతున్నా యన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆధారాలతో విషయాన్ని బయట పెట్టార న్నారు. ఓట్ల దొంగలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు బొంతల రాజేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్‌, నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్‌, పెద్దెల్లి ప్రకాష్‌, ముస్తాఫా, దూళికట్ట సతీష్‌, మెంటం ఉదయ్‌రాజ్‌, సింహాచలం, కొప్పుల శంకర్‌, మాలెం మధు, నజీ మోద్దీన్‌, దాసరి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:47 PM