Share News

ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:51 PM

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్‌ విరాట్‌ విశ్వకర్మ ఉత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ వేణు, అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. వారు విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు చేశారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్‌ విరాట్‌ విశ్వకర్మ ఉత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ వేణు, అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. వారు విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ విశ్వకర్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, విశ్వకర్మ దైవ రూపంగా, ఆధ్యాత్మికతతో, భక్తిశ్రద్ధలతో, ఉత్సవాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. పూర్వకాలంలో అద్భుతమైన నైపుణ్యంతో విరాట్‌ విశ్వకర్మ వంటి మహనీయులు ఉన్నారని, మన భవిష్యత్‌ తరాలు తెలుసుకోవాలని, అందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడు తాయని అన్నారు. విశ్వకర్మ సంఘ నేతలు మాట్లాడుతూ అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వకర్మ జయంతి రోజున ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించాలని వారు కోరారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:51 PM