Share News

సింగరేణి బ్లాస్టింగ్‌లతో పల్లెలు విధ్వంసం

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:30 PM

సింగరేణితో పల్లెలు విధ్వంసానికి గురవుతు న్నాయని, సింగరేణి రహస్యంగా సర్వేలు చేపడుతుందని మానవహక్కుల నేత లింగం రాజయ్య అన్నారు. సోమవారం రాజాపూర్‌ గ్రామంలో ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ భూములను, ప్రభుత్వ పథకాలకు ప్రజలను దూరం చేసి కష్టనష్టాలకు సింగరేణి గురి చేసిందన్నారు.

సింగరేణి బ్లాస్టింగ్‌లతో పల్లెలు విధ్వంసం

రామగిరి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): సింగరేణితో పల్లెలు విధ్వంసానికి గురవుతు న్నాయని, సింగరేణి రహస్యంగా సర్వేలు చేపడుతుందని మానవహక్కుల నేత లింగం రాజయ్య అన్నారు. సోమవారం రాజాపూర్‌ గ్రామంలో ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ భూములను, ప్రభుత్వ పథకాలకు ప్రజలను దూరం చేసి కష్టనష్టాలకు సింగరేణి గురి చేసిందన్నారు. మూడు గ్రామాలకు చెందిన 708.16 గుంటలు సింగరేణి స్వాధీనం చేసుకొని తిరిగి అవార్డు రద్దు చేసిందన్నారు. అనంతరం రాజాపూర్‌, సిద్దపల్లి గ్రామాలకు చెందిన రైతులకు సంబం ధించిన 88 ఎకరాల భూమి కావాలంటూ నోటీసుల ఇవ్వకుండా 24 ఎకరాల్లో సర్వే పనులు చేపట్టిందన్నారు. దీన్ని అడ్డుకొన్న మాజీ ప్రజాప్రతినిధులు ఐదుగురిపై అక్రమ కేసులు నమోదు చేసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టా లని కోరారు. విభజించి పాలించే పద్ధతి చేపట్టి గ్రామంలో విభేదాలు సృష్టిస్తుందని విమర్శించారు.

తమ హక్కులు కాపాడుకునే వరకు రాజాపూర్‌ గ్రామస్థుల ఐక్యతను చాటుకోవాలన్నారు. సింగరేణి నిబంధనల మేరకు నడుచుకోవడం లేదని, మంత్రి మాటాలను సైతం కలెక్టర్‌ పెడచెవిన పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బ్లాస్టీంగ్‌లు నిబంధనల మేరకు జరగడం లేదన్నారు. కాలుష్యం ప్రజలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలను అందిస్తు సింగరేణి గ్రామస్థులకు అన్యాయం చేస్తోందన్నారు. రాజాపూర్‌ గ్రామాన్ని స్వాధీనం చేసుకొని పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ సర్పంచ్‌ పాశం ఓదెలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:30 PM