ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్థులు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:43 PM
మండలంలోని ఊషన్నపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామానికి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సును గ్రామ స్థులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దని, పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రాథమిక పాఠశాలలోనే చదివిస్తామని బస్సులను అడ్డుకున్నారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఊషన్నపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామానికి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సును గ్రామ స్థులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దని, పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రాథమిక పాఠశాలలోనే చదివిస్తామని బస్సులను అడ్డుకున్నారు. వాహ నాలు వచ్చే సమయానికి వారు ఆంజనేస్వామి దేవాలయం వద్ద ఉన్నారు. వ్యాన్లు, బస్సుల్లో ఎక్కుతున్న పిల్లల్ని దింపివేశారు.
పాఠశాలల బస్సులను అడ్డుకుంటున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మ య్య, ఎంఈవో సిరిమల్ల మహేష్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ప్రైవే టు పాఠశాలలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎంఈవో హహేష్ మాట్లాడుతూ ఊషన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేస్తున్నారని, పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ చేతులమీదుగా పాఠశాల అవార్డు పొందిందని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపించి డబ్బు వృథా చేసుకోవద్దని కోరారు.