రామగుండం కార్పొరేషన్‌లో విజిలెన్స్ తనిఖీలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:39 PM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యా లయంలో సోమవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌం ట్స్ విభాగాల్లో రికార్డులు తనిఖీ చేశారు.
కోల్‌సిటీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యా లయంలో సోమవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌం ట్స్ విభాగాల్లో రికార్డులు తనిఖీ చేశారు. ఇంజ నీరింగ్ విభాగంలో రూ.50లక్షల లోపు పను లపై ఆరా తీశారు.
టౌన్ ప్లానింగ్‌లో అను మతుల మంజూరు, దరఖాస్తుల పెండింగ్ తదితర విషయాలపై ఆరా తీశారు. ఆర్థిక విభాగంలో వాహనాలు, డీజిల్, పెట్రోల్ వాడకం, కొనుగోళ్లపై రికార్డులు పరిశీలిం చారు. కార్మికులకు రెయిన్ కోట్లు, యూని ఫాంలు, ఇతర సామగ్రి విషయంపై కార్మికుల తో మాట్లాడారు. కొం దరు కార్మికులు తమ కు సామగ్రి రాలేదని విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఇప్ప టికే తనిఖీలు జరిపా రు. వివిధ విభాగాల పని తీరుపై లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదించే అవ కాశాలున్నాయి.