Share News

వీ-హబ్‌ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:57 PM

వీ-హబ్‌ భవన పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వి-హబ్‌ భవనాన్ని పరిశీలించారు.

వీ-హబ్‌ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

పెద్దపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వీ-హబ్‌ భవన పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వి-హబ్‌ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన వి-హబ్‌లో సీసీ కెమెరాలు, ఏసీలను త్వరగా ఫిక్స్‌ చేసి 3 రోజుల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేలా వి-హబ్‌ భవనాన్ని నిర్మిస్తున్నామని, దీని ద్వారా జిల్లాలో మహిళలకు చాలా మేలు చేకూరుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్‌ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీ రాజ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పవన్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:57 PM