ఎన్‌టీపీసీ అభివృద్ధిలో వెండర్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:56 PM
ఎన్‌టీపీసీ సంస్థ అభివృద్ధిలో వెండర్ల పాత్ర కీలకమని రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్‌టీపీసీ మీలినియం హాల్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ మహిళా వెండర్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
జ్యోతినగర్, నవంబరు1(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీ సంస్థ అభివృద్ధిలో వెండర్ల పాత్ర కీలకమని రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్‌టీపీసీ మీలినియం హాల్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ మహిళా వెండర్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ అవసరాలకు అనుగుణంగా పలు రకాల మెటీరియల్‌ను కొనుగోలు చేయడం, వివిధ రకాల సేవలను పొందే విషయంలో ఖచ్చితమైన నియమాలను పాటిస్తుందన్నారు.
ఈ విషయంలో వెండర్లు సమర్థంగా పని చేయాలన్నారు. రక్షణ, నాణ్యత, నిర్ణీత సమయాల్లో ప్రొక్యూర్ చేయడంలో ఎన్టీపీసీ ఖచ్చితంగా వ్యవహరిస్తుందన్నారు. చిన్నతరహా పరిశ్రమల పరిధిలోకి వచ్చే వెండర్లకు ఎన్టీపీసీ సంస్థ చేయూతనందిస్తుందని ఈడీ చందన్‌కుమార్ హామీ ఇచ్చారు. జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, ఎంఎస్‌ఎంఈ విభాగాల అధికారులు, పరిశ్రమలకు చెందిన అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ మహిళా వెండర్లు పాల్గొన్నారు.