ప్రభుత్వ అసమర్థతతోనే యూరియా కొరత
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:10 AM
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే తెలంగాణలో యూరియా కొరత వచ్చిందని మేడా రం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
ధర్మారం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే తెలంగాణలో యూరియా కొరత వచ్చిందని మేడా రం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చాలని కోరారు. బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదని, ఇప్పుడు రైతు లు చెప్పులు క్యూలో పెట్టే రోజులు వచ్చాయని మండిపడ్డారు. రైతులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఏర్పడిన యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీలు భాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతాంగం యూరియా కొరతతో అల్లాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటూ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సహకార సంఘం కార్యాలయాల వద్ద రైతులు బారులు తీరుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుందని ఆరోపించారు. గోపు ఐలయ్యయాదవ్, ఆముల నారాయణ, బొడ్డుపల్లి శ్రీనివాస్, రవి, శివరాత్రి గంగాధర్, కరివేద శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.