సరిహద్దులు దాటుతున్న యూరియా
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:28 AM
రైతుల కోసం మంథని ప్రాంతానికి కేటాయించిన యూరియా జిల్లా దాటి ఇతర జిల్లాలకు తరలిపోతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు యూరియా కోసం రోజు ఇబ్బదులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని ఫెర్టిలైజర్ షాపులకు కేటాయించిన యూరియా ఇతర ప్రాంతాలకు తరలి పోతుండటంతో మంథని ప్రాంత రైతులు యూరియా కోసం రోజు ఇబ్బందులకు గురవుతుండటంతో స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష సిబ్బందితో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
మంథనిరూరల్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రైతుల కోసం మంథని ప్రాంతానికి కేటాయించిన యూరియా జిల్లా దాటి ఇతర జిల్లాలకు తరలిపోతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు యూరియా కోసం రోజు ఇబ్బదులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని ఫెర్టిలైజర్ షాపులకు కేటాయించిన యూరియా ఇతర ప్రాంతాలకు తరలి పోతుండటంతో మంథని ప్రాంత రైతులు యూరియా కోసం రోజు ఇబ్బందులకు గురవుతుండటంతో స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష సిబ్బందితో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మంథని మండలం సరిహద్దులలో మంచిర్యాల. భూపాలపల్లి జిల్లాలు ఉండటంతో యూరియా ఆ జిల్లాలకు అక్రమంగా తరలి పోతుందనే సమాచారం మేరకు మంథని మండలంలోని సిరిపురం సమీపంలోని సుందిళ్ల బ్యారేజి వద్ద, భూపాలపల్లి జిల్లాకు సరిహద్దుల్లో అడవిసోమన్‌పల్లి వద్ద అధికారులు చెక్ పోస్టులు బుధవారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో చెక్ పోస్టుల వద్ద అక్రమంగా ఇతర జిల్లాలకు తరలిసున్న యూరియా, వాహనాలు పట్టుకున్నారు. దీంతో ఈ సీజన్‌లో ఎంత యూరియా జిల్లాల సరిహద్దులు దాటిందో అర్థమవుతుంది. వర్షాకాలం సీజను మొదట్లో అధికారులు స్పందించి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున్న యూరియా అక్రమ రవాణా అరికడితే మంథని ప్రాంతం రైతులకు యూరియా కష్టాలు వచ్చే ప్రమాదం తప్పేది. ఈ రెండు చెక్ పోస్టుల వద్ద సిబ్బంది రెండు రోజుల్లో ఆరు వాహనాలలో తరలిస్తున్న 140 యూరియా బస్తాలను సిబ్బంది పట్టుకున్నారు. పట్టుబడ్డ వాహనాలు, యూరియా బస్తాలను అధికారులు సీజు చేసి విచారణ జరుపుతున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపితే అక్రమంగా యూరియాను ఇతర జిల్లాలకు అమ్ముకున్న పెర్టిలైజర్ షాపుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.