ఎన్‌టీపీసీ, కార్పొరేషన్ మధ్య తెగని పంచాయితీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:12 AM
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీకి, రామగుండం నగరపాలక సంస్థకు మధ్య ఏడాదిన్నరగా నిర్మాణాలకు సంబంధించిన పంచాయితీ కొనసాగుతోంది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే టౌన్‌షిప్‌లో నిర్మాణాలు చేయ డం వివాదస్పదమైంది.
కోల్‌సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీకి, రామగుండం నగరపాలక సంస్థకు మధ్య ఏడాదిన్నరగా నిర్మాణాలకు సంబంధించిన పంచాయితీ కొనసాగుతోంది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే టౌన్‌షిప్‌లో నిర్మాణాలు చేయ డం వివాదస్పదమైంది. మున్సిపల్ చట్టం 2019 ప్రకా రం అనుమతి లేని నిర్మాణాలను నోటీసులు కూల్చి వేసే అధికారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఉం టుంది. రామగుండం నగరపాలక సంస్థ చాలా నిర్మా ణాలను అదే విధంగా తొలగిస్తుంది. ఎన్‌టీపీసీ టౌన్ షిప్‌లో బీ టైపు క్వార్టర్లు, హెచ్‌ఓడీ బంగళాలు, బీ టైపు క్వార్టర్లు, రెస్టారెంట్, కమ్యూనిటీ సెంటర్, వీఐపీ గెస్ట్ హౌస్ తదితర నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదు. వీటితో పాటు బ్యాచ్‌లర్ క్వార్టర్, సీఐఎస్‌ఎఫ్ బ్యారెక్స్, సీఐఎస్‌ఎఫ్ ఆర్మరీ, సీ-1, సీ-2, సీ-3, సీ-4 క్వార్టర్లకు కూడా మొదట అనుమతులు తీసుకోలేదు. దీనిపై ఆంధ్రజ్యోతి 2024ఏప్రిల్‌లో ‘రామగుండంలో అనుమ తులు లేకుండానే భారీ కట్టడాలు’ శీర్షికన కథనం ప్రచు రించింది. నగరపాలక సంస్థ ఎన్‌టీపీసీ యాజ మాన్యానికి నోటీసులు ఇవ్వడంతో అనుమతులకు దర ఖాస్తు చేసింది. రెండు విడుతలుగా రూ.2.41కోట్ల ఫీజు చెల్లించడంతో సీఐఎఫ్‌ఎఫ్ బ్యారెక్స్, సీఐఎస్‌ఎఫ్ ఆయుధాగారం, సీ టైపు క్వార్టర్లకు అనుమతులిచ్చింది. మిగతా కట్టడాలకు సంబంధించి రెసిడెన్షియల్ జోన్‌లో లేకపోవడంతో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్(సీఎల్‌యూ) తీసుకోవాలంటూ నోటీసులు ఇచ్చింది. ఎన్‌టీపీసీ యాజమాన్యం దరఖాస్తులను కార్పొరేషన్ ప్రత్యేకాధి కారి అయిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. సీఎల్ యూలో డీ టైపునకు సంబంధించి రూ.8.33ఎకరాలు, హెచ్‌ఓడీ బంగ్లా 7.9ఎకరాలు, వీఐపీ గెస్ట్‌హౌస్ 2.07ఎకరాలు, బీటైపు క్వార్టర్లకు 3.21ఎకరాలకు సం బంధించి సీఎల్‌యూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. గతేడాది ప్రభుత్వానికి ఫైల్ నివేదించగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది.
రూ.26కోట్ల ఫీజుకు నోటీసులు
ఎన్‌టీపీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్మించిన బీ టైపు, డీ టైపు క్వార్టర్లు, హెచ్‌ఓడీ బంగ్లా, రెస్టారెంట్లు, కమ్యూనిటీ హాల్ బంగ్లా, వీఐపీ గెస్ట్‌హౌస్‌కు సంబం ధించి సుమారు రూ.26కోట్లు నిర్మాణ అనుమతుల ఫీజులు, అపరాధ రుసుములు చెల్లించాలంటూ నగర పాలక సంస్థ ఎన్‌టీపీసీ యాజమాన్యానికి ఈ ఏడాది మేలోనే నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఆగస్టులోనే నిర్మాణాల తొలగింపునకు నోటీసులు
ఎన్‌టీపీసీ యాజమాన్యం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆగస్టులో నిర్మాణాలను తొలగించాల్సిం దిగా కార్పొరేషన్ కమిషనర్ స్పీకింగ్ ఆర్డర్స్ జారీ చేశారు. సాధారణంగా డిమాలిష్ నోటీసులు జారీ అయిన తరువాత నిర్మాణదారుల నుంచి స్పందన రాక పోతే కార్పొరేషనే నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. ఎన్‌టీపీసీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కావడంతో కార్పొరేషన్ వేచి చూసే ధోరణిని అవలంభిస్తుంది. కాగా ఎన్‌టీపీసీ యాజమాన్యం మాత్రం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పెండింగ్‌లో ఉన్నందు వల్ల తాము చెల్లింపులు జరుపలేమని, గడువు కావాలంటూ కోరుతుంది. దీంతో పాటు 14శాతం డెవలప్‌మెంట్ చార్జీని కూడా తొలగిం చాలంటూ పేర్కొంటున్నది. కార్పొరేషన్ నుంచి అనుమ తులు పెండింగ్‌లో ఉండగానే నిర్మాణాల ప్రక్రియ మాత్రం పూర్తికావచ్చింది.
ఆది నుంచి వివాదాలే...
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, జెన్‌కో, ఎన్‌టీపీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగ రేణిలు ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లించి నిర్మాణ అను మతులు తీసుకుంటున్నారు. కానీ ఎన్‌టీపీసీ మాత్రం మొదటి నుంచి వివాదాలకే పోతుంది. ఎన్‌టీపీసీ 7వ యూనిట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో కూడా వివాదాలు నడిచాయి. తరువాత ఒత్తిడి మేరకు ఫీజులు చెల్లించింది. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో వివాదాలు లేకున్నా, ఎన్‌టీపీసీతో నగరపాలక సంస్థకు నిర్మాణాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీ స్థానిక సంస్థ అయిన కార్పొరేషన్‌తో సమన్వయంతో మెదలడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి.
ఎన్‌టీపీసీకి ఒక నీతి... మాకొక నీతా...
అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకునే సందర్భంలో ప్రజలు ఎన్‌టీపీసీ ఉటంకిస్తున్న పరిస్థి తులు ఉన్నాయి. నిర్మాణ అనుమతులు తీసుకోని ఎన్‌టీ పీసీకి ఒక నీతి, మాకు ఒక నీతా అనే ప్రశ్నలు కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఎదురవుతున్నాయి.
నోటీసులు ఇచ్చాం... వేచి చూస్తున్నాం...
అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ
ఎన్‌టీపీసీకి అనుమతి లేని నిర్మాణాలకు సంబం ధించి నోటీసులు ఇచ్చాం. సుమారు రూ.26కోట్ల ఫీజు చెల్లింపులకు సంబంధించి జాప్యం జరుగుతుంది. సీఎల్ యూ పెండింగ్‌లో ఉందని ఎన్‌టీపీసీ పేర్కొంటున్నది. సమస్య పరిష్కారానికి వేచి చూస్తున్నాం. ఉన్నతాధికా రుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.