Share News

సీపీఆర్‌పై అవగాహన

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:13 PM

సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్‌) పై అందరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వి. వాణిశ్రీ తెలిపారు. కలెక్టరెట్‌లో శుక్రవారం అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డా. ప్ర శాంత్‌ సీపీఆర్‌ చేసే విధానాన్ని వివరించారు. అనంతరం పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయిం చారు.

సీపీఆర్‌పై అవగాహన

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 17 (ఆంఽధ్రజ్యోతి): సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్‌) పై అందరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వి. వాణిశ్రీ తెలిపారు. కలెక్టరెట్‌లో శుక్రవారం అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డా. ప్ర శాంత్‌ సీపీఆర్‌ చేసే విధానాన్ని వివరించారు. అనంతరం పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయిం చారు. డా. వాణిశ్రీ మాట్లాడుతూ, గుండె పోటు వంటి ఆరోగ్య సమస్యలు నివారించా లంటే జీవనశైలిలో మార్పులు తీసుకురావా లని, నిత్యం వ్యాయామం చేయాలని, తక్కు వ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలని, ఉప్పు వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఆక స్మికంగా కుప్ప కూలితే 108కు సమాచారం ఇచ్చి, సీపీఆర్‌ చేయడం ద్వారా కాపాడ వచ్చన్నారు. ప్రోగ్రాం అధికారి డా. ఆర్‌.రాజ మౌళి, డా. కె.వి. సుదాకర్‌ రెడ్డి, డా. బి. కిరణ్‌ కుమార్‌, డా. నిస్సీ క్రిస్టినా, డా.మమత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సీపీఆర్‌ విధానంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని 108 అంబులెన్స్‌ కోఆర్డినేటర్‌ దాస రపు సంపత్‌ అన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు, అధ్యాపకు లకు సీపీఆర్‌ విధానంపై అవగాహన కల్పిం చారు. శ్రీవాణి జూనియర్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ బాలసాని శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌, అధ్యా పకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:13 PM