రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:56 PM
సుల్తానాబాద్ పట్టణ శివారు రైల్వే గేటు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌడ వీధికి చెందిన ముత్యం రాకేష్(29), పూదరి రోహిత్(24)అలియాస్ అభి, సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన పాపని ఆదర్శ్‌లు బైకుపై సుల్తానాబాద్ నుంచి సుద్దాలకు వెళుతున్నారు. అల్లీపూర్‌కు చెందిన గసిగంటి రఘు బైక్‌పై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణ శివారు రైల్వే గేటు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌడ వీధికి చెందిన ముత్యం రాకేష్(29), పూదరి రోహిత్(24)అలియాస్ అభి, సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన పాపని ఆదర్శ్‌లు బైకుపై సుల్తానాబాద్ నుంచి సుద్దాలకు వెళుతున్నారు. అల్లీపూర్‌కు చెందిన గసిగంటి రఘు బైక్‌పై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పూదరి రోహిత్ మృతి చెందగా, ఆసుపత్రిలో ముత్యం రాకేష్ మరణించాడు. గాయపడ్డ పాపని ఆదర్శ్‌తోపాటు అల్లీపూర్‌కు చెందిన రఘు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో రాకేష్ రోహిత్‌లు మామఅల్లుళ్లు. రాకేష్ అక్క కొడుకు రోహిత్. మృతుల్లో ముత్యం రాకేష్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండగా, రోహిత్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తదితరులు సంఘటన స్థలాన్ని, ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు.