ఆల్బెండజోల్ మాత్రలతో నులి పురుగుల నివారణ
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:12 AM
నులిపురుగుల నివార ణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి తెలిపారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): నులిపురుగుల నివార ణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి తెలిపారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. ఆమె మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులతో శారీరక, మానసిక ఎదు గుదల మందగిస్తుందన్నారు.
తల్లిదండ్రులు పిల్లల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గోర్లు పెరగకుండా కత్తిరించాలని, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకునే విధానం నేర్పించాలన్నారు. వీటి వల్ల రక్తహీనత, మతిమరుపు లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. తినే ఆహారాలపై మూతలు ఉంచాలని, రోడ్ల వెంట అపరిశుభ్రమైన పదార్థాలు తినకూడదని తెలిపారు. అల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. 706 అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 541, ప్రైవేటు పాఠశాలలు 161, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 56 ఉండగా, మొత్తం 1,97,070 లక్షల మాత్రలను పంపిణీ చేశామన్నారు. మొదటి రోజు 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు 1,75,736 పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు అరుణ, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.