ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:38 PM
ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గోదావరి ఖని బస్సు డిపో నుంచి పుణ్య క్షేత్రాలకు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నా మని, డిసెంబర్ 6న హంపి, గోకర్ణ, ఉడిపి, మురుం డేశ్వర్, శృంగేరి, ధర్మస్థల, కుకి సుబ్రహ్మణ్య, మం త్రాలయం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని, పెద్దలకు రూ.6600, పిల్లలకు రూ.5000 చార్జి, 15న కాణిపాకం, అరుణాచలం, పలని, పాతా ళశంభు, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబకు పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు ఉందన్నారు. 25న అన్నవరం, సింహాచలం, ఆర్‌కే బీచ్, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షరామం, అంతర్వేది, పాలకొల్లు, భీమవరం, విజ యవాడ, అమరావతికి పెద్దలకు రూ.4200, పిల్ల లకు రూ.3200, 28న తిరుపతి, కాణిపాకం, అరుణా చలం పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4500 చార్జితో బస్సులను నడపనున్నట్టు తెలిపారు. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైకి ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేశామని, పూరి, ఉజ్జయిని, ద్వారక, షిరిడి పుణ్యక్షేత్రాలకు ఖని బస్టాండ్ నుంచి త్వరలో ప్రత్యేక బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. వివరాలకు 7013504982, 7382847596, 7989847927, 9908138036 నెంబర్లలో సంప్రదిం చాలని కోరారు. అసిస్టెంట్ డిపో మేనేజర్ గీత కృష్ణ, మూర్తి, భక్తులు పాల్గొన్నారు.