Share News

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:37 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్‌ ఎం నాగభూషణం అన్నారు. ఆది వారం గోదావరిఖని బస్టాండ్‌ నుంచి ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్రంలోని అన్నవరం యాత్రికులతో వెళు తున్న సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

కళ్యాణ్‌నగర్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్‌ ఎం నాగభూషణం అన్నారు. ఆది వారం గోదావరిఖని బస్టాండ్‌ నుంచి ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్రంలోని అన్నవరం యాత్రికులతో వెళు తున్న సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా భక్తులకు దైవదర్శనం కోసం అన్నవరం సూపర్‌ లగ్జరీని ఏర్పాటు చేశామ న్నారు.

శ్రావణమాసం మొదటి సోమవారం అన్నవరంలో ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకుని అక్కడి నుంచి సింహాచలం, భీమేశ్వరం, విజయ వాడ కనకదుర్గ ఆలయాల్లో భక్తులకు దర్శనం చేయించనున్నట్టు చెప్పారు. కర్ణాటక బీదర్‌లోని పలు ఏరియాల్లో ప్రత్యేక ఆలయాల దర్శనం కోసం బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ ప్రత్యేక రౌండ్‌ ట్రిప్‌ యాత్ర రూ.3500చార్జీతో ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఎవరైనా యాత్రికులు ప్రత్యేక బస్సులు కావాలంటే 701350 4982 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ట్రా ఫిక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గీతకృష్ణ, సూపరింటెం డెంట్‌ అమృత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:37 PM