శిక్షణ అంశాలను పాఠశాలలో అమలుచేయాలి
ABN , Publish Date - May 27 , 2025 | 12:11 AM
ద్యార్థులు అన్ని సామర్ధ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి మాధవి అన్నారు. గర్రెపల్లి జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న జీవశాస్త్రం ఉపాధ్యా యుల రెండో దశ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిం చారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్ధేశించి డీఈవో మాట్లాడుతు శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నేర్చుకున్న ప్రతీ అంశాన్ని పాఠశాలల్లో అమ లు చేయాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
సుల్తానాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అన్ని సామర్ధ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి మాధవి అన్నారు. గర్రెపల్లి జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న జీవశాస్త్రం ఉపాధ్యా యుల రెండో దశ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిం చారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్ధేశించి డీఈవో మాట్లాడుతు శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నేర్చుకున్న ప్రతీ అంశాన్ని పాఠశాలల్లో అమ లు చేయాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పిల్లల్లో అభ్యసనా ఆసక్తిని మెరుగుపరుచాలన్నారు. జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ఉపాధ్యాయుతోపాటు కోర్స్ డైరెక్టర్ కవిత, రిసోర్స్‌పర్సన్ నరేష్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్పీలు కిరణ్, రిజయా తదితరులు ఉన్నారు.