Share News

ఎన్నికల నిర్వహణపై శిక్షణ

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:38 AM

గ్రామ పంచా యతీ ఎన్నికల సందర్భంగా మండల ప్రజా పరిషత్‌ కార్యాల యంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భం గా 138 మంది ఎన్నికల అధికారులకు ఎంఇఓ హరిప్రసాద్‌, రిసోర్స్‌పర్సన్‌ అంజనీ ప్రసాద్‌ ఎన్నికలు ఏ విధంగా నిర్వ హించాలి, ఎన్నికల సామగ్రిపై వివరించారు.

ఎన్నికల నిర్వహణపై శిక్షణ

ముత్తారం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచా యతీ ఎన్నికల సందర్భంగా మండల ప్రజా పరిషత్‌ కార్యాల యంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భం గా 138 మంది ఎన్నికల అధికారులకు ఎంఇఓ హరిప్రసాద్‌, రిసోర్స్‌పర్సన్‌ అంజనీ ప్రసాద్‌ ఎన్నికలు ఏ విధంగా నిర్వ హించాలి, ఎన్నికల సామగ్రిపై వివరించారు. ఎన్నికల పోలింగ్‌ రోజు వ్యవహరించాల్సిన విధానాలను, ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ చేపట్టే అంశాలపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎంపిడిఓ సురేష్‌, మండల స్థాయి అధికారులున్నారు.

రామగిరి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై సింగరేణి కమ్యూనిటీహాల్‌లో శనివారం ఎన్నికల సిబ్బందికి అవగా హన సదస్సును చేపట్టారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు టివోటి సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన సద స్సుతో పాటు శిక్షణను చేపట్టారు. ఎంపీడీవో శైలజారాణి, ఎఈవో కొమురయ్య, టివోటి పురుషోత్తం, సూపరింటెండెంట్‌ ఉమేష్‌లు పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కమాన్‌పూర్‌ మండలానికి కేటాయించిన సుమారు 106 మంది ప్రిసైడింగ్‌ అధికారులకు శనివారం ఎంఈఓ ఇల్లందుల విజయ్‌ కుమార్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌ రాంరెడ్డి, ఆగయ్యలు శిక్షణ నిచ్చారు. ఎంపీడీఓ ప్రియాంక మాట్లాడుతూ ఎలక్షన్‌ విధు లు సవివరంగా తెలుసుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులపై ఉందని తెలిపారు. ప్రిసైడింగ్‌ అధికారులు, గుండారం కార్యదర్శి, ఎంపీడీఓ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:39 AM