Share News

ప్రకృతి సేద్యం దిశగా

ABN , Publish Date - May 27 , 2025 | 12:44 AM

ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా, రైతును ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ అన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) పథకాన్ని తీసుకవచ్చింది. సహజ వ్యవసాయాన్ని ప్రొత్సహించే దిశగా తీసుకవచ్చిన సేంద్రీయ సాగు ద్వారా భూసారాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ పథకంలో రైతులను ప్రోత్సహించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కసరత్తు మొదలైంది

 ప్రకృతి సేద్యం దిశగా

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా, రైతును ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ అన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) పథకాన్ని తీసుకవచ్చింది. సహజ వ్యవసాయాన్ని ప్రొత్సహించే దిశగా తీసుకవచ్చిన సేంద్రీయ సాగు ద్వారా భూసారాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ పథకంలో రైతులను ప్రోత్సహించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కసరత్తు మొదలైంది. రైతులకు శిక్షణ అందించడానికి వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

జిల్లా వ్యాప్తంగా 700 హెక్టార్లలో సాగు

జిల్లాలో నేషనల్‌ మిషన్‌ అన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకంలో 14 క్లస్టర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్లస్టర్‌లో 125 మంది చొప్పున రైతులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం మొదటి విడతలో ఒక క్లస్టర్‌లో 50 హెక్టార్ల చొప్పున 700 హెక్టార్లలో సాగు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం రైతులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సేంద్రియ పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కొత్త పథకం ద్వారా జిల్లాలోని 13 మండలాల్లో మొదటగా 14 గ్రామా ల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా శ్రీకారం చుట్టారు. రైతులు ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం వల్ల దిగుబడి తగ్గుతుందని చీడ, పీడల ఎక్కువ సోకు తాయనే కారణంగా ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపరు. ఎరువుల వినియోగం, పురుగుల మందు వాడకం లేకపోవడంతో నష్టపోతామనే భావిస్తారు. రైతులు తొలి మూడేళ్లలో దిగుబడి తగ్గినప్పటికీ సాగు వ్యయం కూడా తగ్గి రైతులకు రాబడి పెరుగుతుందనే అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు మట్టి నమూ నాలను కూడా సేకరిస్తున్నారు. సేంద్రియ పంటల సాగు కోసం రైతు లకు ఎకరానికి రూ. 4 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. జిల్లాలో సేంద్రియ సాగుపై రైతుల్లోనూ చర్చ మొదలైంది.

జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు

ముందస్తుగానే రుతు పవనాలు వస్తున్నాయనే వాతావరణ శాఖ ప్రకటనలతో రైతులు వానాకాలం సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయనున్నారు. గంభీరావుపేటలో 19,330 ఎకరాలు, ఇల్లంత కుంటలో 38,470 ఎకరాలు, ముస్తాబాద్‌లో 25,250 ఎకరాలు, సిరిసిల్లలో 5,883 ఎకరాలు, తంగళ్లపల్లిలో 22,031 ఎకరాలు, వీర్నపల్లిలో 8,792 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 21,130 ఎకరాలు, బోయినపల్లిలో 21,310 ఎకరాలు, చందుర్తిలో 21,610 ఎకరాలు, కోన రావుపేటలో 23,700 ఎకరాలు, రుద్రంగిలో 10,105 ఎకరాలు, వేము లవాడ 10,578 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15,614 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో వరి 1.84 లక్షల ఎకరాలు, పత్తి 49,760 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెసర 79 ఎకరాలు, కందు లు 1,155 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, జొన్నలు 14 ఎక రాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల సాగుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం జిల్లాలో రైతుల కోసం 56,568 క్వింటాళ్ల వరి విత్తనాలు, పెసర 4.08 క్వింటాళ్లు, మొక్కజొన్న 27.04 క్వింటాళ్లు పత్తి 1,28,650 ప్యాకెట్లు కందులు 122.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని సిద్ధం చేశారు. వానాకాలం సాగులో ఎరువులు 56,060 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో యూరియా 25,370 మెట్రిక్‌ టన్నులు, డీఎపీ 3,460 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,390 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,115 మెట్రిక్‌ టన్నులు ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.

Updated Date - May 27 , 2025 | 12:44 AM