నేడు మలి విడత పోరు..
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:33 AM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ఆదివారం ముగిసిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పోలింగ్, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. శనివారం మలి విడతలో ఎన్నికలు జరిగే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో పల్లెలకు చేరుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ఆదివారం ముగిసిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పోలింగ్, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. శనివారం మలి విడతలో ఎన్నికలు జరిగే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో పల్లెలకు చేరుకున్నారు. వారికి బందోబస్తుగా పోలీసులు తరలి వెళ్లారు. ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించి ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు.
రెండో విడుదల 77పంచాయతీలు, 530 వార్డులు
జిల్లాలో రెండో విడతలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాల్లో 88 గ్రామపంచాయతీలు ఉండగా 11 పంచాయతీల్లో సర్పంచ్, 228 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. వీటిని మినహాయించి 77 సర్పంచ్, 530 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థానాల్లో 279 మంది అభ్యర్థులు, 530 వార్డు సభ్యుల స్థానాల్లో 1342 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరి భవిత్యంపై ఓటర్లు ఎలాంటి తీర్పునువ్వబోతున్నారనే ఆసక్తి గ్రామాల్లో నెలకొంది.
ఎన్నికల నిర్వహణకు 2003 మంది సిబ్బంది
జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు 77గ్రామాల్లో 530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు మండలాల్లో జోన్లు, రూట్లు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపించారు. బోయిన్‌పల్లి మండలంలో నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లు, ఇల్లంతకుంటలో ఐదు జోన్లు, ఎనిమిది రూట్లు, తంగళ్ళపల్లి ఐదు జోన్లు 10 రూట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 2003 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు 910 మంది, ఇతర సిబ్బంది 1093 మంది ఉన్నారు.
పల్లెల్లో కాసుల వర్షం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం సద్దుమణగడంతోనే పోటీలో ఉన్న అభ్యర్థులు కాసుల వర్షం కురిపించారు. ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రలోభాలకు గురిచేశారు.77 సర్పంచ్ స్థానాల్లో 279 మంది అభ్యర్థులు, 530 వార్డు స్థానాల్లో 13742 మంది అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే విధంగా మద్యం, నోట్లో పంపిణీ భారీగా చేపట్టినట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ 2 వేల వరకు సమర్పించుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించి ఓటు వేసి తిరిగి పంపించడానికి కావాల్సిన రవాణా ఏర్పాట్లతో పాటు రానుపోను ఖర్చులతో పాటు ఓటుకు నోటును కూడా అందించారు. కుటుంబంలో నాలుగు నుంచి ఆరు ఓట్లు ఉంటే కనీసంగా రూ 20 వేల నుంచి రూ 50 వేల వరకు అందినట్లుగా చర్చించుకుంటున్నారు. ఓటర్లను గాలం వేయడానికి నోట్లకే ప్రాధాన్యం ఇచ్చారు.
పటిష్టంగా నిఘా.. బందోబస్తులో 700 మంది పోలీసులు
మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేసే దిశగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అదనపు బందోబస్తు పై దృష్టి పెట్టారు. మూడు మండలాల్లో 77 గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టంగా బందోబస్తుతో నిఘా పెట్టారు. 19 సమస్యాత్మక గ్రామాలు, 14 సున్నితమైన గ్రామాలను గుర్తించారు. బోయిన్‌పల్లి మండలంలో 7 సున్నితమైన, 6 సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించారు. ఇల్లంతకుంటలో 7 సున్నితమైన, 8 సమస్యాత్మక గ్రామాలు, తంగళ్ళపల్లి ఐదు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ మహేష్ బీ గీతే పర్యవేక్షణలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 26 రూట్లలో మొబైయిల్ బృందాలు, ఏడు జోనల్ బృందాలు, మూడు క్విక్ రియాక్షన్స్ బృందాలు, రెండు స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టారు.
మలి విడతలో 104905 మంది ఓటర్లు
జిల్లాలో 260 గ్రామపంచాయతీలో 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1701772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. రెండో విడతలో 104905 మంది ఓటర్లు ఉండగా పురుషులు 50773 మంది, మహిళలు 54131 మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓట్లే 3358 మంది అధికంగా ఉన్నారు.
మండలం గ్రామపంచాయతీలు పురుషులు మహిళలు మొత్తం
తంగళ్లపల్లి 27 18619 19848 38468
ఇల్లంతకుంట 27 17401 18531 35932
బోయిన్‌పల్లి 23 14753 15752 30505
-----------------------------------------------------
మొత్తం 77 50773 54131(1 జెండర్) 104905
-----------------------------------------------------
ఎన్నికలు జరిగే సర్పంచ్, వార్డులు,
మండలం సర్పంచ్ స్థానాలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
తంగళ్లపల్లి 27 110 174 451
ఇల్లంతకుంట 27 79 190 454
బోయిన్‌పల్లి 23 90 166 437
-----------------------------------------------------
మొత్తం 77 279 530 1342
--------------------------------------------------