Share News

నేడే మలి విడత సమరం

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:05 AM

జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన వాహనాల్లో తీసుకవెళ్లారు.

నేడే మలి విడత  సమరం

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ సామగ్రిని తమకు కేటాయించిన వాహనాల్లో తీసుకవెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే ఉప సర్పంచులను కూడా అదే రోజు ఎన్నుకోనున్నారు. రెండో విడతలో అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, 684 వార్డు స్థానాలకు గత నెల 30వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ధర్మారం మండలం బంజేరుపల్లి, బొట్లవనపర్తి, నాయకంపల్లి సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు మండలాల్లో కలిసి 177 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 73 గ్రామ పంచాయతీల్లో 70 సర్పంచ్‌ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 70 సర్పంచ్‌ స్థానాలకు 286 మంది అభ్యర్థులు, 504 వార్డు స్థానాలకు 1454 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడు తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 684 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి 1031 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. అంతర్గాం మండలంలో 8, ధర్మారం మండలంలో 15, జూలపల్లి మండలంలో 5, పాలకుర్తి మండలంలో 11 కేంద్రాలు, మొత్తం 39 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వెబ్‌ కాస్టింగ్‌తో పాటు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫ ఏరులై పారిన మద్యం... ఓటుకు నోటుతో గాలం..

వారం రోజుల పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులకు గెలుపుపై టెన్షన్‌ నెలకొన్నది. ఈసారి ఎన్నికల్లో మద్యం ఏరులై పారగా, ఓటుకు 500 నుంచి 2 వేల రూపాయలకు పైగా కొందరు పంపిణీ చేశారు. సర్పంచ్‌ అభ్యర్థులే గాకుండా వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు సైతం ఓటుకు నోటు ఇస్తుండడం గమనార్హం. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరుగుతున్నది. పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనరల్‌, బీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను, కుల సంఘాలను, యువతను, మహిళలను ఆకర్శించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొంత మంది అభ్యర్థులు ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకుని అప్పులు తీసుక వచ్చి పెద్ద ఎత్తున ఖర్ఛు చేశారు. ఉపాఽధి, ఉద్యోగాల రీత్యా ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. రాను, పోను ప్రయాణ ఖర్చులతో పాటు ఓటుకు నోటు డబ్బులను సైతం ఇతరుల ఫోన్ల నుంచి గూగుల్‌పే, ఫోన్‌పేల ద్వారా పంపించారని సమాచారం. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు పంపకాలు చేపట్టారు. అభ్యర్థులు ఎన్నికలపై తీవ్రమైన ఉత్కంఠతో ఉన్నారు. గెలుపుపై పైకి ధీమాగానే కనబడుతున్నప్పటికీ, లోలోపల టెన్షన్‌కు గురవుతున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత గెలుపొందిన వార్డు సభ్యులు అంతా కలిసి ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు.

ఫ మండలాల వారీగా ఓటర్ల వివరాలు..

--------------------------------------------------------

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

----------------------------------------------------

1. అంతర్గాం 8807 9122 1 17930

2. పాలకుర్తి 13934 14184 0 28118

3. జూలపల్లి 11977 12186 0 24163

4. ధర్మారం 21483 22210 4 43697

---------------------------------------------------------

మొత్తం 56201 57702 5 113908

----------------------------------------------------------

Updated Date - Dec 14 , 2025 | 12:05 AM