Share News

మండలానికో నమూనా ఇందిరమ్మ ఇల్లు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:56 PM

పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేం దుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతీ మండలానికి ఒక ఇంటి నమూనా నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటిని 42 రోజుల్లో పూర్తి చేయనున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి.

 మండలానికో   నమూనా ఇందిరమ్మ ఇల్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేం దుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతీ మండలానికి ఒక ఇంటి నమూనా నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటిని 42 రోజుల్లో పూర్తి చేయనున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్స రానికి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రజాపాలన గ్రామ, పట్టణ సభల్లో దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించారు. గత నెల 26న మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ పూర్తి స్థాయిలో అర్హులందరికీ 1700 ఇళ్లు మంజూరు చేశారు. త్వరలోనే ఆ ఇళ్ల నిర్మాణాలను ఆరంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతీకగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వం నిర్ధారించిన ఇందిరమ్మ ఇంటి నమూనా ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యే లబ్ధిదారులు తమ ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లోని మండల పరిషత్‌ కార్యాలయాల ఆవరణలో గల ప్రభుత్వ ఖాళీ స్థలంలో నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు చేపట్టారు. ఈ నమూనా ఇళ్లకు ఒక్కో దానికి 5 లక్షల రూపాయలు కేటాయించారు. ఇందిరమ్మ ఇంటి నమూనాను చూసి ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు మంజూరు కానున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నమూనా ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయా మండలాల మండల పరిషత్‌ కార్యాలయాల ఆవరణలో ప్రభుత్వ స్థలాల్లో ఈ నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు.

42 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు

నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు 42 రోజుల్లో పూర్తి చేసేందుకు సంబంధిత గృహ నిర్మాణ శాఖ అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నమూనా ప్రకారం ఆయా మండలాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారుల సమక్ష్యంలో ఆయా మండల స్థాయి అధికారులు నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి మార్కింగ్‌ చేసి పనులు ఆరంభించారు. జిల్లాలో నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిపి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో జిల్లా గృహ నిర్మాణశాఖ అధికా రులు ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండ లాల్లో శరవేగంగా జరుగుతున్నాయి. స్లాబ్‌ లెవెల్‌ వరకు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలను మండల పరిషత్‌ అధికా రులతోపాటు హౌసింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణాలను 42 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల పనులను ఆరంభిస్తామని అన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:56 PM