ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:22 AM
గతంలో మాదిరిగా పాత ఇళ్ల పేరిట బిల్లులు తీసుకోవడం, ఇళ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించింది. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభు త్వం జియో ఫెన్సింగ్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం కృతిమ మేధ (ఏఐ) సాయంతో ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇంది రమ్మ ఇళ్లతో దీన్ని అమల్లోకి తేనున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గతంలో మాదిరిగా పాత ఇళ్ల పేరిట బిల్లులు తీసుకోవడం, ఇళ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించింది. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభు త్వం జియో ఫెన్సింగ్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం కృతిమ మేధ (ఏఐ) సాయంతో ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇంది రమ్మ ఇళ్లతో దీన్ని అమల్లోకి తేనున్నారు.
2013లో రాష్ట్రంలో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించినా అమలు కాలేదు. పేద, మధ్య తరగతి ప్రజల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుక వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3 లక్షల వరకు ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలాలు లేని వాళ్లకు కొన్ని గ్రామాల్లో ఇందరిమ్మ కాలనీలను నిర్మించగా, స్థలాలు ఉన్న వారికి నేరుగా ఇల్లు మంజూరు చేసింది. ఈ ఇళ్ల పథకంలో అప్పట్లో పలు అక్రమాలు జరిగాయి. ఇళ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు, పాత ఇళ్ల పేరిట బిల్లులు తీసుకోవడం వంటి తప్పిదాలు జరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం లోకి వచ్చిన బీఆర్‌ఎస్ ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై విచారణ చేపట్టింది. కానీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదు. ఈ పథకానికి బదులు డబుల్ బెడ్ రూముల ఇళ్ల పథకాన్ని తీసుక వచ్చింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.07 లక్షలు, మౌలిక వసతులకు లక్షా 25 వేలు మంజూరు చేసింది. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఆ డబ్బుతో ఇళ్లు నిర్మించలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. జిల్లాలో కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గడిచిన పదేళ్లలో అనేక మందికి ఇళ్లు దక్కలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. లక్షా 82 వేల వరకు దరఖాస్తులు రాగా, వాటిపై ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తించారు. జనవరి 26న మండలానికి ఒక గ్రామంలో అర్హులైన వారందరికీ 1703 ఇళ్లు మంజూరు చేశారు. ఆ పనులు ఆరంభం కానున్నాయి. మిగతా గ్రామాల్లో దశల వారీగా ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర. వాళ్లు తయారు చేసిన జాబితాలకే ఇన్‌చార్జీ మంత్రి ఆమోదం తెలపనున్నారు.
ఫ చూపిన స్థంలోనే ఇల్లు నిర్మించాలి
మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల సర్వేచేసిన అధికారులు సొంత స్థలం ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్-1 జాబితాను సిద్ధం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తున్న చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి సర్వే చేసిన సందర్భంగా చూపిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది. ఇళ్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు. ఇప్పుడా స్థలం జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ముగ్గు పోసే రోజు కార్యదర్శికి, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాలి. సర్వేలో చూపిన స్థలం అదేనా, కాదా అని వారు ధ్రువీకరించాలి. తర్వాతే ప్రత్యేక యాప్‌లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో ఫెన్సింగ్ చేస్తారు. తర్వాత తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద నిల్చొని యాప్ ద్వారా పరిశీలిస్తారు. గతంలో ఇచ్చిన వివరాలు మ్యాచ్ అయితేనే ఫొటోలు, వివరాలు అప్‌లోడ్ అవుతాయి. ఏమాత్రం తప్పుడు సమాచారం ఉన్నా యాప్ తిరస్కరిస్తుంది.
గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం.. పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవిగా చూపించి బిల్లులు తీసుకోవడం.. బేస్‌మెంట్ లెవల్లో మొదటి బిల్లు ఉపాధి నిధుల నుంచి కావడంతో అందిన కాడికి దోచుకున్నారు. ఇకపై అలాంటి వాటికి అవకాశం ఉండదు. అలా చేస్తే ఇల్లు మంజూరు రద్దు అవుతుందని, బిల్లు రాదని అధికారులు చెబుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మార్చి 8 తర్వాత ఆయా గ్రామాలు, పట్టణాలకు ఇళ్లు కేటాయించి మంజూరు చేయనున్నారు. ఆ వెంటనే ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణాలను ఆరంభించనున్నారు.