మేడిపల్లి ఓపెన్‌కాస్టులో పులి సంచారం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:21 AM
మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తు న్నది. శనివారం రాత్రి గోదావరినది దాటి లింగాపురం గ్రామశ్మశానవాటిక సమీపంనుంచి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాంతంలో ప్రవేశించింది. బొగ్గుఉత్పత్తి నిలిచిపో యిన తరువాత నాలుగేళ్లుగా వేలఎకరాల విస్తీర్ణంలో మేడి పల్లి ఓసీపీ ప్రాంతమంతా అడవిని తలపించేలా చెట్లుపెరిగాయి.
గోదావరిఖని, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తు న్నది. శనివారం రాత్రి గోదావరినది దాటి లింగాపురం గ్రామశ్మశానవాటిక సమీపంనుంచి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాంతంలో ప్రవేశించింది. బొగ్గుఉత్పత్తి నిలిచిపో యిన తరువాత నాలుగేళ్లుగా వేలఎకరాల విస్తీర్ణంలో మేడి పల్లి ఓసీపీ ప్రాంతమంతా అడవిని తలపించేలా చెట్లుపెరిగాయి. ఇప్పటికే ఆ ప్రాంతం అడవి పందులు, జింకలు, కుందేళ్లు లాంటి అనేక వన్యప్రాణాలకు ఆవా సంగా మారింది. ఓపెన్‌కాస్టు గుట్టలు, బొగ్గు తీసిన భారీ లోయలతో పూర్తి ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారిపోయింది. అడవి కంటే దట్టంగా చెట్లు, పొదలు పెరిగిపోయాయి. దీంతో పెద్దపులి మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో చేరినట్టు తెలుస్తున్నది. గోదావరినదిలో పులి పాదముద్రలు గుర్తించిన కొందరు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య, కొమురయ్య, రామ గుండం డీవైఆర్‌వో దేవదాసు, రహమతుల్లా, విజయ్ కుమార్, రాంమూర్తి, శ్రవంతి తదితరులు గోదావరి నదిలో పులి పాదముద్రలను పరిశీలించి నిర్ధారించారు. శనివారం రాత్రి పులి ఆవలి గట్టు నుంచి గోదావరిదాటి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాం తంలో చేరిందని నిర్ధారిం చారు. పాదముద్రలకు సంబం ధించిన కొలతలను తీశారు. శనివారం సాయంత్రం 5గం టల ప్రాంతంలో ఇటువైపు వచ్చినట్టునిర్ధారించారు. వారం పది రోజులుగా ఈ పులి శ్రీరాంపూర్, సీసీసీ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించిందని, అక్కడి ఫారెస్టు అధికారులు పులి సంచారాన్ని పరిశీలిస్తూ వస్తున్నారని అన్నారు. ఆ పులే ఇటువైపు వచ్చి ఉంటుందని వారన్నారు. మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతం మేడిపల్లి, లింగాపూర్, మల్కాపూర్, విలేజీ రామగుండం గ్రామపరిసరాలను ఆనుకుని ఉంటుంది. ఈగ్రామాలకు సంబంధించిన ప్రజలు, పశువుల కాప ర్లు మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతం వైపు వెళ్లేందుకు జాగ్రత్తలు పాటిం చాల్సిందిగా ఫారెస్టు అధికారులు కోరారు. మేడిపల్లి ఓపెన్ కాస్టు మీదుగా లింగాపూర్‌కు ప్రయాణం చేసే ప్రజలు కూడా ఆమార్గం గుండా జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పులి ఎక్కడ ఉందనేది పరిశీలిస్తామని వారన్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.