అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలి
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:45 PM
ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలపతిరావు అన్నారు. శనివారం గోదావరిఖని గాంధీన గర్‌లో ఐఎఫ్‌టీయూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలపతిరావు అన్నారు. శనివారం గోదావరిఖని గాంధీన గర్‌లో ఐఎఫ్‌టీయూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడు రోజుల క్రితం బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద అరెస్టు చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్‌ను చిత్రహింసలు పెట్టి ఎన్‌కౌంటర్ చేశారన్నారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ పాటిస్తున్నా ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్నవారిపై హత్యాకాండ కొనసా గించడాన్ని ప్రజలందరూ ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. నాయకులు ఐ కృష్ణ, నరేష్, వెంకన్న, శంకర్, అశోక్, బుచ్చక్క పాల్గొన్నారు.