టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:54 PM
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలతో సజావుగా పనులు నిర్వహిస్తున్నా ఆడిట్ అధికారులు జరిమానాలు విధించాలని నివేదికలు అందిస్తూ ,చిన్న తప్పును పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ బొంగోని వెంకటేష్ గౌడ్ సామాజిక వేదికలో ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి రూరల్ , సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలతో సజావుగా పనులు నిర్వహిస్తున్నా ఆడిట్ అధికారులు జరిమానాలు విధించాలని నివేదికలు అందిస్తూ ,చిన్న తప్పును పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ బొంగోని వెంకటేష్ గౌడ్ సామాజిక వేదికలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో 2024-25కి సంబంధించిన ఉపాధిహామీ పనులపై ఆడిట్ నిర్వహించగా సామాజిక వేదిక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల వారీగా నివేదికలు అందిస్తున్న దృష్ట్యా తుర్కలమద్దికుంటలో చెరువు పూడికతీత పనుల్లో భాగంగా 104 మంది ఉపాధి కూలీలు ఒకే తీరుగా పనులు చేపట్టారని రికార్డు నమోదు చేసినట్లు ఆడిట్ చేపట్టిన అధికారులు నివేదిక ఇచ్చే క్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్ అఽధికారులతో వాగ్వాదానికి దిగాడు. ఆడిట్ చేపడుతున్న తరుణంలో ఇబ్బందులు పెడుతున్నారని గతంలో లక్షల రూపాయలు జరిమానాలు విధిస్తే చెల్లించానని వేదికలో పేర్కొన్నాడు. ఎస్‌ఆర్‌పీ టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతూ పలు రకాలుగా డిమాండ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పాల్గొన్న ఏపిడి సత్యనారాయణ జోక్యం చేసుకొని సముదాయించారు. సామాజిక వేదిక సజావుగా కొనసాగింది. 30 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధిహామీ పనుల నివేదికను సమర్పించారు.
ఫ ఉపాఽధి పనులు సజావుగా నిర్వహించాలి
గ్రామాల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులు సజావుగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ పీడీ సత్యనారాయణ అన్నారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహించిన సామాజిక వేదికలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా చేపట్టిన పనుల వివరాలు వివరించగా నమోదు చేసుకొని తప్పిదాలు జరిగిన వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా 30 గ్రామ పంచాయతీల్లో తప్పిదాలు చేసినందుకు రూ.13వేల 186లు జరిమానా విధించారు. కొమురయ్య, ఎస్‌ఆర్‌పీ ప్రదీప్, ఎంపీవో ఫయాజ్, పంచాయతీ రాజ్ ఏఈ పవన్, క్వాలీటి కంట్రోల్ హరి, ఏపీవో రమేష్‌బాబు, జేఈ రాజయ్య, సుజాత, టెక్నికల్ అసిస్టెంట్ లు వెంకటేష్, దివ్య, సురేష్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.