అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:21 AM
నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని రైతువేదికలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.
ధర్మారం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని రైతువేదికలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. మంజూ రైన నిధులు వాటి పనులపై సమీక్షించారు. రోడ్ల నిర్మాణం, తాగు నీరు, విద్యుత్ స్తంభాల షిప్టింగ్, లూజ్ వైర్ల బిగింపుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు కావా లని, ఏయే గ్రామాల్లో ఎవరు ఎంత ఆక్ర మించారనే వివరాలు నెల లోపు అందజే యాలని మంత్రి అడ్లూరి అధికారులను ఆదేశించారు. నర్సింగాపూర్, ఖిలావన పర్తి, బొమ్మరెడ్డిపల్లి, శాయంపేట, ధర్మారంలోని ప్రభుత్వ భూములు కొందరు బడాబాబు లు ఆక్రమించారని, జనవరిలో అక్రమ దా రులపై చర్యలు తీసుకునే విధంగా అధికా రులు సన్నద్ధం కావాలని సూచించారు. 2014కు ముందు ఎవరైతే పేదలై ఉండి పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్నారో వారిని వదిలేసి 2014 తరువాత భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మారంలోని 476 లో ఆక్రమించిన భూములను గుర్తించి స్వాధీ నం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశామని, వాటిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వ వచ్చని ఆర్‌డీ ఓ గంగయ్య తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీపీఓ వీరబుచ్చయ్య, ఎలక్ర్టికల్ ఎస్‌ఈ గంగాధర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.