Share News

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:22 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అకాడమిక్‌ ప్యానెల్‌ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

పెద్దపల్లి కల్చరల్‌, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అకాడమిక్‌ ప్యానెల్‌ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 ఉన్నత పాఠశాలల్లో అకాడమిక్‌ ప్యాన ల్‌ బృందాలు తనిఖీ చేసి, వారు పరిశీలించిన అంశాలు, విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యం, విద్యార్థుల హాజరు సంఖ్య వివరాలను అందించారని కలెక్టర్‌ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల టీఎల్‌ఎంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాబోయే నెల రోజుల వ్యవధిలో ఉపాధ్యాయుల పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో కఠి నంగా వ్యవహరించాల్సి ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. తరగతి గదిలో విద్యార్థులు కనీసం 80 శాతం పాఠ్యాంశాలపై అవగాహన కలిగి ఉం డాలన్నారు. అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పీఎం షేక్‌, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:22 AM