జిల్లాలో యూరియా కొరత లేదు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:52 PM
జిల్లాలో యూరియా కొరత లేదని, 5,573 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, నెల వారి ప్లాన్‌లో భాగంగా సరఫరా అవుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రతిపాదనలు పం పించామన్నారు.

పెద్దపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత లేదని, 5,573 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, నెల వారి ప్లాన్‌లో భాగంగా సరఫరా అవుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రతిపాదనలు పం పించామన్నారు. యూరియా అమ్మకాలు జరిగే ప్రక్రియలో భాగంగా ఈ-పాస్ మెషిన్‌లో రైతుల వేలి ముద్రలు తీసుకుని యారియాను ఇస్తున్నామన్నారు. యాసంగి సీజన్‌లో అక్టోబర్ 1వ తేదీ నుంచి శనివారం వరకు 28,293 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, రైతులు ఇప్పటి వరకు 22,720 మెట్రిక్ టన్నుల యూరి యాను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,573 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ నెల, వచ్చే నెలలో మరో 11,531 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. యూరియా నిల్వలను అందు బాటులో ఉంచడమే కాకుండా, సకాలంలో సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం వ్యవసాయ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నా మన్నారు. శనివారం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వ్యాగన్‌లో వచ్చిన 1501 మెట్రిక్ టన్నుల యూరియా పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆదిరెడ్డి అవసరమున్న సోసైటీలకు లారీల్లో తరలించారు.