పార్టీలో గ్రూపులకు తావులేదు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:45 AM
పార్టీలో గ్రూపులకు తావులేదని, అంతా కాంగ్రెస్ కుటుంబమేనని, కలసికట్టుగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్యే భానుప్రసాదరావులు అన్నారు. పట్టణంలోని నీరుకుల్ల రోడ్డులో సోమవారం నిర్వహించిన సభలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరారు.
సుల్తానాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పార్టీలో గ్రూపులకు తావులేదని, అంతా కాంగ్రెస్ కుటుంబమేనని, కలసికట్టుగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్యే భానుప్రసాదరావులు అన్నారు. పట్టణంలోని నీరుకుల్ల రోడ్డులో సోమవారం నిర్వహించిన సభలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరారు. గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్, వీరగోని రమేష్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ఏడాదిన్నరలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అకారణంగా బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు బద్‌నామ్ చేస్తున్నారని విమర్శించారు. యూరియాను కేంద్రం పంపించడంలో విఫలమైందని, రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం చేశామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు మినుపాల ప్రకాశ్ రావు, ఈర్ల స్వరూప, మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్, పలు మండలాల అఽధ్యక్షులు సతీష్, రాజేశ్వర్ రెడ్డి, పన్నాల రాములు, దామోదర్ రావు, కల్లెపల్లి జానీ, అక్బర్, మాజీ ఎంపీపీ రాంమూర్తి, మస్రత్, చక్ర ధర్, వెంకటేశం, పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బయ్యగౌడ్, చిలుక సతీష్ పాల్గొన్నారు.