Share News

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు...

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:41 PM

రామగుం డం నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా అభి వృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్‌ వద్ద చిరు వ్యాపారుల కోసం నిర్మించిన వాణిజ్య, వ్యాపార సంస్థలను ఆయన ప్రారంభించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు...

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రామగుం డం నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా అభి వృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్‌ వద్ద చిరు వ్యాపారుల కోసం నిర్మించిన వాణిజ్య, వ్యాపార సంస్థలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో గజి బిజిగా ఉన్న వ్యాపార సంస్థలను తొలగించి ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశా మని, రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగి మంత్రి మృత్యువాత పడ్డారని, ఇప్పుడు వ్యాపారుల కోసం కొత్తగా వాణిజ్య భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగిందని, ప్రధాన చౌరస్తాలో ప్రత్యేక వ్యాపార సముదాయాలు, విశాలమైన రహదారులు, ఓల్డ్‌ అశోక వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, పాత మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ప్రత్యేక దుకాణాల సముదా యాలు, ఫైవింక్లయిన్‌, తిలక్‌నగర్‌ ఏరియాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. రామ గుండం అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రామగుండం అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1000కోట్ల నిధులను తీసుకువచ్చామని తెలిపారు. నూతన వ్యాపార సముదాయాన్ని నిర్మించుకోవడానికి కృషి చేసిన మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చిరు వ్యాపా రులు సన్మానించారు. కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగ స్వామి, మహంకాళి స్వామి, ప్రకాష్‌, ఆసిఫ్‌ పాషా, రాజిరెడ్డి, రంజిత్‌, శివ, సత్యనారాయణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠా కూర్‌ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలానికి చెందిన 30మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తిరుపతినాయక్‌, హనుమాన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి మక్కాన్‌సింగ్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ స్థాని క సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవే ర్చిందని, మరిన్ని హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే నెరవేర్చనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో అంతర్గాం ఉప సర్పంచ్‌ దారవేని సంతోష్‌, మణికుమార్‌, అజయ్‌, ప్రవీణ్‌ ఉన్నారు.

రామగుండం కార్పొరేషన్‌ 5వ డివిజన్‌లో అధ్యక్షుడు కుందురు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గంగానగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. కార్పొరేషన్‌లో ప్రజలకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, మంచినీటి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, సత్యప్రసాద్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:41 PM